ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
On
విశ్వంభర, సిద్దిపేట: రూరల్ మండలం పుల్లూరు ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. కలెక్టర్ గా రామగల్ల హరిణిది, డీఈవోగా అభినయ్, డిప్యూటీ ఈవోలుగా యశ్విక, హర్షిత, ధనుష్ ఎంఈవోగా వ్యవహరించారు. నిత, నిత్య నిహారిక, శివాని, సుహాని, రక్షిత, అనుశ్రీ, జయశ్రీ, రోషన్, సాత్విక్, దీక్షిత్, సాయిచరణ్, హర్షవర్ధన్ ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా రంజిత్, దినేష్, మహేష్ అటెండర్లుగా వ్యవహరించారు. హెడ్మాస్టర్లుగా ఝాన్వీ, వరుణ్ తేజ్ తరగతులను పర్యవేక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వామి, ఉపాధ్యాయులు కళాకిరణ్, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, సరిత, భవానిలు విద్యార్థులను సమన్వయ పరిచారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు.



