పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలి
On
విశ్వంభర, నాగారం: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలం అధ్యక్షులు,మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ పై రూ.60, కమర్షియల్ వాటిపై రూ.140 పెంచారని తెలిపారు.ఇది పేద,మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారిన ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వాలు అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర, రాష్ట్రాలు నేడు వారి సంక్షేమం మంట గలిపాయని అన్నారు.ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైతే తాజాగా కేంద్రం ధరలు పెంచడం లాంటి విషయాలు దారుణంగా మారాయని వివరించారు.



