మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి

మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి

  • జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ 

విశ్వంభర, మహబూబాబాద్:  జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థానిక, రెవెన్యు అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.అనిల్ కుమార్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యవస్థను విస్తరించడంతో పాటు మహిళలకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలతో ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటూ, తల్లులు, శిశువుల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. నిజమైన మహిళా సాధికారత ఇంటి నుంచే ప్రారంభమవుతుందన్నారు.  పాఠశాలలో బాలికలను ప్రశ్నలు అడగడానికి, పోటీపడడానికి, నాయకత్వం వహించడానికి ప్రోత్సహించినప్పుడు అది ప్రారంభమవుతుందని, అలాగే సమాజంలో మహిళల భద్రత కేవలం వారి సమస్యగా మాత్రమే కాకుండా అందరి బాధ్యతగా భావించినప్పుడు అది నిజంగా ఆచరణలోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా టీఎన్జీవో అధ్యక్షులు శ్రీనివాస్ , డి.పి.ఆర్.ఓ శ్రీ రాజేంద్రప్రసాద్ , ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ శ్రీమతి రజిత  పాల్గొన్నారు. ఐసిడిఎస్ సీడీపీఓలు, సూపర్వైజర్లు, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, సఖి సిబ్బంది, ఇతర జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Tags: