రాజ్యాంగాన్ని ఖననం చేశారు 

రాజ్యాంగాన్ని ఖననం చేశారు 

  •  భారతీయ జనతా యువమోర్చా 

విశ్వంభర, చండూర్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్,కడియం శ్రీహరి  పార్టీ ఫిరాయింపుల కేసులో ఈరోజు శాసనసభ స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడం చూస్తే రాజ్యాంగాన్ని ఖననం చేసినట్లుగా ఉన్నదని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు  పిన్నింటి నరేందర్ రెడ్డి అన్నారు.ఈ  తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని  ఎమ్మెల్యేలు బీ ఆర్ ఎస్  గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి,ఆరు నెలల్లోనే పార్టీ మారి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఎన్నికల కమిషన్ అందజేసిన బీ ఫారం ఉన్నదని అలాగే రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారని ఇంత నగ్నసత్యం కళ్లెదుటే ఉన్నా,అది "పార్టీ ఫిరాయింపు" కాదని స్పీకర్  తీర్పునివ్వడం విస్మయపరుస్తోందని అన్నారు..ఇది ఖచ్చితంగా ప్రజాతీర్పును, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే తప్ప ఇంకేమి లేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి తరపున ప్రచారం చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పూర్తిగా అన్యాయమని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు ప్రజలు విసిగిపోయారని, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే చర్యలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు . మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ  రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చిన 'పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని' ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంత బహిరంగంగా ఉల్లంఘిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమి  సమాధానం చెబుతారన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రగల్భాలు పలికే మీరు, మీ పార్టీ నేత చేసిన ఈ ఫిరాయింపును కాపాడేలా వచ్చిన ఈ తీర్పును ఎలా సమర్థిస్తారని,ఈ తీర్పు రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తీరని అవమానమని దిన్ని భారతీయ జనతా  యువ మోర్చా పక్షాన  తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

Tags: