ముగిసిన రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 

ముగిసిన రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 

విశ్వంభర, చింతపల్లి: శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తెలిపారు. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వాహకులు ఐదు వందలు కొట్టు తులం బంగారం పట్టు అని వినూత్న ప్రయత్నం చేయగా లక్కీ డ్రాలో 686 నెంబర్ తీదేడు గ్రామానికి చెందిన కలగొని అంకులమ్మ చిన్న మల్లయ్య విజేతగా నిలిచారు. తులం బంగారం విజేత కలగొని చిన్న మల్లయ్య దంపతులకు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్ లు శాలువాతో సన్మానించి తులం బంగారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి  ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, గ్రామ పాలక వర్గం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags: