ఈ నెల 21న  హ్యాండ్లూమ్ టెక్స్ టైల్ ఎక్స్ పో ప్రారంభం 

పద్మశాలి ప్రతిభావంతులకు ఉగాది పద్మశాలి పురస్కారాలు 

ఈ నెల 21న  హ్యాండ్లూమ్ టెక్స్ టైల్ ఎక్స్ పో ప్రారంభం 

విశ్వంభర, హైదరాబాద్ :-ఈ నెల 21, 22 తేదీలలో పెద్ద ఎత్తున హ్యాండ్లూమ్ టెక్స్ టైల్ ఎక్స్పో ను ఎల్బినగర్ మన్సూరాబాద్ లో ని కెబిఆర్ కన్వెన్షన్ హల్  ప్రారంభించనున్నారు.  పద్మశాలి వ్యాపార్ నెట్ వర్క్ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం , తెలంగాణ చేనేత ఐక్య వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోను విజయవంతం చేయాలనీ కోరుతూ  నిర్వాహకులు మీడియా సమావేశం ద్వారా తెలియజేశారు. పద్మశాలి ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు , కళాకారులకు , ఆర్ధిక, రాజకీయ , వ్యాపార , సామాజిక రంగాలకు చెందిన ప్రతిభావవంతులకు తెలుగు సంవత్సరాది యుగాది పురస్కారాలను అందిస్తున్నట్టు వారు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పో లో చేనేత వస్త్ర ప్రదర్శనలతో పాటు విభిన్న రకాల అయిన ప్రదర్శనలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు , చిన్నారుల ఆటపాటలు నిర్వహించబడుతాయని తెలిపారు. అలాగే వివిధ వ్యాపారులు తమ తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శన ,  విక్రయ కేంద్రాలు గా ( స్టాల్స్ ) గా ఏర్పాటు చేసుకోవడానికి సువిశాల ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. కావున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి మన తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు చొరవ తీసుకుని ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక , అధ్యక్షులు రాపోలు వీర మోహన్ తెలిపారు. వివిధ చేనేత ఉత్పత్తుల ప్రదర్శన మరియు స్టాల్స్ ఏర్పాటు చేసుకొనుటకు కమిటీ వారిని సంప్రదించాలని కోరారు. ఎక్స్పో కార్యక్రమానికి మీడియా పార్టనర్స్ గా V3 న్యూస్ ఛానల్ , విశ్వంభర దిన పత్రిక ద్వారా కార్యక్రమాలను అందించడం జరుగుతుంది. 

Tags: