రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన జగ్గారెడ్డి

రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన జగ్గారెడ్డి

విశ్వంభర, సంగారెడ్డి:  బై పాస్ రోడ్ విస్తరణ కోసం జరుగుతున్న పనులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బుధవారం పరిశీలించారు. ఐబి గెస్ట్ హౌస్ నుండి  ఆర్డీవో క్యాంప్ ఆఫీస్ వరకు  నడుచుకుంటూ వెళ్లి పనులు జరుగుతున్న తీరును నిర్మాణ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో ఇంటి వద్ద మూల పై సర్కిల్  రానున్న నేపథ్యంలో అక్కడ ఉన్న చెట్లను, నిర్మాణాలను   సాధ్యమైనంత త్వరగా తొలగించాలని కాంట్రాక్టర్  కు సూచించారు. ఐబి  గెస్ట్ హౌస్ నుండి మొదలుకుని బసవేశ్వర విగ్రహం వరకు జరుగుతున్న విస్తరణ పనుల్లో వేగం పెంచాలని, రోడ్ పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు ఉండకూడదని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ షఫీ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: