ఆదర్శవంతంగా జీవించాలి
- సూర్యాపేట ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యత, మహిళల భద్రత, సైబర్ మోసాల నివారణపై ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో మునగాల మండల పరిది ఆకుపాముల గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొని నేరరహిత సమాజ నిర్మాణం, పౌరుల బాధ్యతకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. బినాన్స్, క్రిప్టో కరెన్సీ లాంటి డిజిటల్ మనీ మార్పిడిలో జాగ్రత్తలు పాటించాలని అత్యాశకు వెళ్లి సైబర్ మోసగాళ్లకు చిక్కుకొని సైబర్ నేరాల్లో చుక్కోవద్దని హెచ్చరించారు, డిజిటల్ కరెన్సీ మార్పిడి చేసే విషయంలో అధిక డబ్బు సంపాదించాలనే అత్యాశకు పోయి ఈ ప్రాంతంలో చాలామంది యువత సైబర్ మోసగాళ్ల ద్వారా డబ్బును పొంది సైబర్ నేరాల్లో చిక్కుకున్నారని తెలిపారు. ప్రస్తుత సమాజానికి డ్రగ్స్ అనే చీడపీడ పట్టిందని ఈ డ్రగ్స్ నిర్మూలించకపోతే సమాజంలో నేరప్రవృత్తి పెరుగుతుందని, పౌరులు డ్రగ్స్ మత్తుకు బానిసలై జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు, ఇలాంటి డ్రగ్స్ ను మన సమాజం నుండి ప్రాలదోలాల్సిన, తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. తప్పులు చేసే వారిని సంస్కరించి నేరరాహిత సమాజాన్ని నిర్మూలించాలని అన్నారు. దీనికోసం పోలీసులతో భాగస్వామ్యమై డ్రగ్స్, గంజాయి కి సంభందించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని కోరారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి. తప్పుడు మార్గంలో వాహనాలు నడపవద్దు, రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు, ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని కోరారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు. రాష్ట్ర పోలీసు ప్రతిష్టాత్మకంగా అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రత కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం అన్నారు. ఆకుపాముల గ్రామ సమీపంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని గుర్తు చేశారు. గ్రామ ప్రజలు రహదారి వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్... సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్స్పెక్టర్ లక్ష్మి నారాయణ, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ శివ శంకర్, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఇతర ఎస్సైలు రవీందర్, ఏడుకొండలు, కోదాడ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ రామాచారి, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత, గ్రామ పౌరులు ఉన్నారు.



