అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
On
విశ్వంభర, పెద్దశంకరంపేట: ఎన్ హెచ్ 161లో పెద్దశంకరంపేట మీదుగా తరలిస్తున్న రెండు ఆవులు, ఒక లేగదూడను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. బుధవారం మొయినాబాద్ నుంచి డెగ్లూరుకు వాహనంలో తరలిస్తుండగా కోలపల్లి టోల్ ప్లాజా వద్ద తనిఖీ చేస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా గోవులను తరలిస్తున్న షఫీ, మోసిన్లపై కేసు నమోదు చేసి ఆవులను గోశాలకు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.



