విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలి
విశ్వంభర, నిజామాబాద్: నగరంలోని అర్సపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సొసైటీ సోల్జర్స్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థి విజయ స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు సరైన ఉన్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని ప్రణాళిక బద్ధంగా చదువుకొని కొనసాగించాలని దేశభక్తి సామాజిక స్పృహతో ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు. సోల్జర్స్ సొసైటీ యూత్ అధ్యక్షుడు మేదర్ శేఖర్ మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు కంగారు పడకుండా తమ లక్ష్యం వైపు ముందుకు సాగాలని తమ లక్ష్యంలో ఏవైనా అడ్డంకులు వస్తే స్వామి వివేకానంద ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయులను మహనీయులను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు సాగుతూ లక్ష్యాలను ఛేదించాలని వారి యొక్క ఆదర్శాలను మన జీవితంలో ఇమ్మడింపజేసుకొని మన జీవితాలను మెరుగుపరచుకొని వాటితో పాటు సమాజ సేవా కార్యక్రమంలో కూడా ముందుండాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా భాగంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల కిట్టును అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ హెడ్మాస్టర్ పిల్లలు శ్రీనివాస్ ,ఉపాధ్యాయులు యూత్ సభ్యులు కుచ్చుల సంజు చందు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



