మార్చి1న సాహిత్య సభ
విశ్వంభర, హైదరాబాద్ : మియాపూర్ సాహితీ మిత్ర మండలి ఆధ్వర్యంలో మార్చి 1న సాహిత్య సభ నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు, సభా వ్యాఖ్యాత, విశ్రాంత తెలుగు పండితులు భువనగిరి పురుషోత్తం తెలిపారు. కూకట్పల్లి రామాలయం సమీపంలో ఉన్న భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ లో జరగబోయే ఈ సాహిత్య సభలో ప్రముఖ సాహితీవేత్త, అవధాన విద్యా వికాసపరిషత్ అధ్యక్షులు, గురుకుల పాఠశాల విశ్రాంత ప్రాచార్యులు మరుమాముల దత్తాత్రేయశర్మగారికి అవధాన ప్రచోదక బిరుదు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. చిత్ర కవితా సామ్రాట్ చింతా రామకృష్ణారావు అధ్యక్షతన జరిగబోయే ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా గురుకుల విద్యాలయాల సంస్థ విశ్రాంత ఉపకార్యదర్శి చివుకుల శ్రీనివాస ప్రసాద్, ప్రధాన వక్తగా ప్రముఖ పద్యనాటక రచయిత, నంది అవార్డు గ్రహీత శారదా ప్రసన్న, సాహితీ వేత్తలు కె.వి.ఎన్.ఆచార్య, డాక్టర్ ఆచర్య ఫణీంద్ర, సాధన నరసింహారావు, ఎం. కృష్ణకిషోర్, బి. సత్యానందం తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా సంచాలకరత్న కటకం వేంకట రామశర్మగారి సంచాలకత్వంలో ప్రముఖ అష్టావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యంగారిచే అష్టావధానం నిర్వహిస్తున్నామని, సాహిత్య అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.



