వేసవిలో మంచినీటి సమస్య రాకుండా చూడాలి 

వేసవిలో మంచినీటి సమస్య రాకుండా చూడాలి 

విశ్వంభర, పిర్జాదిగూడ: వేసవిలో ప్రజలకు మంచినీటి సమస్యలు రాకుండా చూడాలని,రాబోయే ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలోని ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా అందేలా చేయాలని,ఎక్కడా నీరు వృధా కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆర్.వి. ఫౌండేషన్ చైర్మన్ తుంగతుర్తి రవి అధికారులను కోరారు. బుధవారం నాడు బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌ ఆఫీస్ లో మేనేజర్ క్రాంతి గారికి పలు కాలనీల వాసులతో కలిసి, నీటి సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాన్ని అందజేశారు.  ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. వేసవి కాలంలో నీటి ఎద్దడి కారణంగా ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని తెలిపారు. ముఖ్యంగా పైప్‌లైన్ల లీకేజీలను అరికట్టాలని, నీరు వృధా కాకుండా ప్రతిరోజు పర్యవేక్షించాలని మరియు ప్రతి గల్లీలోనూ నీటి సరఫరా సక్రమంగా ఉండేలా ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని, అలాగే నీటి అవసరం ఎక్కువగా ఉన్న చోట ట్యాంకర్ లను పెట్టి నీటి సరఫరా చేయాలనీ ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో మేడోజు రామబ్రహ్మం, ఎర్ర వెంకటేష్, ములుపోజు మహేష్, కిరణ్, రామక్రిష్ణ, శ్రీను, రాజలక్ష్మి, జయమ్మ, సరస్వతి, లలిత, పద్మ, నర్మదా, లత, సుకన్య, త్రివేణి, వెంకటేష్, శైలజ, లత, లక్ష్మీ, మమత, గంగమ్మ మరియు ఇతర కాలనీల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: