దోమల నివారణకు ఫాగింగ్ ప్రారంభం

దోమల నివారణకు ఫాగింగ్ ప్రారంభం

విశ్వంభర,ఇనుగుర్తి: దోమల నివారణ కోసం మండల కేంద్రం, మేజర్ గ్రామపంచాయతీ ఇనుగుర్తిలో ఫాగింగ్ ప్రక్రియ ఆ గ్రామ సర్పంచి తమ్మడపల్లి కుమార్ బుధవారం సిబ్బందిచే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో దోమల బెడద తీవ్రంగా ఉండడంతో వాటి నుంచి ప్రజల ఆరోగ్యం కాపాడడానికి దోమల మందుచే ఫాగింగ్ చేయిస్తున్నట్లు చెప్పారు. మురుగ కాలువలు, మురుగునీటి గుంతలు, పెంట కుప్పలు తదితర దోమలు మసలే ప్రాంతాలలో ఫాగింగ్ చేయనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఉపసర్పంచి యాదగిరి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ వార్డ్ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.

Tags: