యువజనోత్సవాల గోడ పత్రిక విడుదల
విశ్వంభర, హిమాయత్‌నగర్ : షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మార్చి 1 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా యువజనోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గోడ పత్రికను విడుదల చేశారు. యువజనోత్సవాల సందర్భంగా “స్టాప్ డ్రగ్స్” నినాదంతో డ్రగ్స్, గంజాయి తదితర మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారం చేపట్టనున్నారు. క్రీడాపోటీలు, వ్యాసరచన, చిత్రలేఖన, ఉపన్యాస పోటీలు, రక్తదాన శిబిరాలు, యువ కవి–గాయకుల సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల సందేశాలు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ, రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ, భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లు దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. భగత్ సింగ్ స్పూర్తితో నేటి యువత చెడు అలవాట్లు, మాదకద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు బిజ్జ శ్రీనివాసులు, టి. సత్యప్రసాద్, పేరబోయిన మహేందర్, యుగంధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సల్మాన్ బేగ్, పి. శివకుమార్, సుధీర్, వెంకటేష్, మధుకర్, జెట్టి శ్రీను, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



