కన్నుల పండువగా శత చండీ యాగం 

కన్నుల పండువగా శత చండీ యాగం 

విశ్వంభర, బషీర్ బాగ్ : శత చండీ యాగ మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మోతీనగర్‌లోని శ్రీ శృంగేరి శారదా శంకరమఠంలో శ్రీ శంకరీ జగద్విద్యాలయ ఆరాధనోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న యజ్ఞప్రియ మహోత్సవాలు భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగాయి . ఈ మహోత్సవాలు  శ్రీదేవి సాయిరత్న, శేషయ్య  దంపతుల ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు, వేద పారాయణాలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ యజ్ఞ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మహోత్సవాలకు యూసుఫ్‌గూడలోని శ్రీ సాయి త్రిపుర పీఠం ఆధ్వర్యంలో పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ పరమహంస ఆశీస్సులు అందిస్తున్నారు. అలాగే అమెరికాలోని సాయి ధ్యాన మందిర్ దేవాలయం కు చెందిన ఎన్‌ఆర్‌ఐ భక్తులు జాహ్నవి , రామకిరణ్  దంపతుల సహకారంతో ఈ మహోత్సవాలు మరింత వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Tags: