నెల్లికుదురులో స్వపరిపాలన దినోత్సవం
On
విశ్వంభర,నెల్లికుదురు: స్వయం పరిపాలన దినోత్సవం రోజు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి స్టూడెంట్స్ కు పాఠాలు బోధించడం అభినందనీయమని ఎస్సై చిర్ర రమేష్ బాబు అన్నారు. మండలంలోని మునిగలవీడు ఎంపీపీ ఎస్ లో బుధవారం సెల్ఫ్ గవర్నమెంట్ డే ఘనంగా జరుపుకున్నారు.దీనికి హాజరై ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్తు చదువులకు జీవితానికి పునాదులు అన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం రవీందర్ టీచర్స్ వెంకటయ్య,సుధాకర్,యుగంధర్,గీత, కళ్యాణి,జ్యోతి,కవిత,ఉష తెలంగాణ పాఠశాలల స్కావెంజర్ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇసంపల్లి సైదులు సంగీత తదితరులు పాల్గొన్నారు.



