బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ 

బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ 

విశ్వంభర, చింతపల్లి : చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల (జాతర) సందర్భంగా వాల్ పోస్టర్లను సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి గుట్ట అభివృద్ధి కోసం దేవాలయం వద్ద దక్షిణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ,  రామలింగేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇడబోయిన వెంకటయ్య యాదవ్, ఆలయ అర్చకులు సురభి సత్యనారాయణ శర్మ సోదరులు, మాజీ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్లు ధరణిపతి రమణారావు, ఉలుపాల శేఖర్ రెడ్డి, సోనగంటి గొవర్థనాచారి, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ తిరుమణి పాపయ్య, గ్రామ పెద్దలు మర్రు రామారావు, మోర కిరణ్, అంకం అంజూర, తిరుమణి వెంకటయ్య, జూలురి శ్రీధర్, మర్రు శ్రీనివాసరావు, కాయితి బచ్చిరెడ్డి, మర్రు సురెందర్ రావు, జెల్ల వెంకటేశ్వర్లు, రాశిక పాండయ్య, నేలపట్ల మురళి, వీరమల్ల వెంకటయ్య, సిమర్ల శ్రీను యాదవ్, బొడ్డు యాదగిరి, రెడ్డి పరమేష్, ఇడమోని శ్రీను యాదవ్, ఉడుత శంకరయ్య, సివర్ల శంకర్, మెరిక శంకరయ్య, చింతకుంట్ల రాకేష్, వలమోని వెంకటయ్య, మెండె మల్లయ్య, సందె శంకర్, పంబాల చెన్నయ్య, సందె బిక్షం, కొన్రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: