ఘనంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం

ఘనంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం

విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్ సర్కిల్ 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దానగళ్ళ అనిత యాదగిరి దంపతులు వారి నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి అంగరంగ వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఎంతో ఘనంగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం నిర్వహిస్తామని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి కళ్యాణం నిర్వహించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులమైనామన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, శ్రేయోభిలాశులు, అభిమానులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

Tags: