వెలుగుమట్లలో  మోడల్ కాలనీ నిర్మిస్తాం 

వెలుగుమట్లలో  మోడల్ కాలనీ నిర్మిస్తాం 

  • ప్రతి పేదవానికి ఇల్లు మా ప్రభుత్వ లక్ష్యం 
  • ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

విశ్వంభర,  ఖమ్మం: రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి ఒకేసారి 22,500 కోట్లు కేటాయించి దేశ చరిత్రలో రికార్డు సృష్టించాం, ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తాం, దేశంలోని ఇతర రాష్ట్రాల వారు వచ్చి చూసే విధంగా మోడల్ కాలనీ నిర్మాణం జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. వెలుగుమట్లలో పేదలకు పంచగా మిగిలిన 16 ఎకరాల భూమిని తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల నిర్మాణానికి ఉపయోగిస్తాం అన్నారు. భూదాన్ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాదు కరెంటు, నీళ్లు, రోడ్లు, ఆసుపత్రి, కమ్యూనిటీ హాల్, షాపింగ్ కాంప్లెక్స్ అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రేపటి నుంచే (గురువారం) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించండి డిసెంబర్ 9 కల్లా మోడల్ కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నాను, ముగ్గురు మంత్రులము కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తాం డిసెంబర్ 9 కల్లా నిర్మాణం పూర్తి చేయాలి పాలు పొంగించాలి, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గృహప్రవేశాలు జరగాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. ఇది పేదల పక్షాన మాకు ఉన్న నిబద్ధత అన్నారు. ఇల్లు కట్టిస్తామని పది సంవత్సరాలపాటు పరిపాలించిన వారు చెప్పిన మాటలు నమ్మి చూసి చూసి పేదల కళ్ళు కాషాయని, వారు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదని తెలిపారు. అలాంటి వారికి మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. ఈ రాష్ట్రంలో జీవించే ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఆలోచన అన్నారు. ఆ ఆలోచనలో భాగంగానే రాష్ట్రంలో పేదవారి కోసం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు 22,500 కోట్లు ఒకేసారి మంజూరు చేసి చేసే చరిత్రలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం తమది అనే డిప్యూటీ సీఎం తెలిపారు. ఇలాంటి ప్రభుత్వంపై కావాలని పేదలకు మేలు జరగవద్దని కొద్దిమంది బురద జల్లుతున్నారు అని డిప్యూటీ సీఎం ఆరోపించారు. గత కొన్ని సంవత్సరాలుగా మాఫియా వెలుగుమట్లలో పేదల నుంచి డబ్బులు వసూలు చేసింది వారికి కనీస సౌకర్యాలు లేకుండా సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసింది, పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చేయాలని వెలుగుమట్లలో అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది అన్నారు. పేదలు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆత్మ గౌరవంగా బతికేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ప్రజా ప్రభుత్వం వెనుకాడదని తెలిపారు. వెలుగుమట్లలో అర్హత కలిగిన 412 మందిని గుర్తించి తన తమ భేదం లేకుండా జిల్లా పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లో ఉన్న 101 మంది పేదలకు వారి గ్రామాల్లో ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ నిర్మాణానికి అనుమతి పత్రాలు మంజూరు చేసినట్టు తెలిపారు.పేదల నిసహాయతను అడ్డుపెట్టుకొని బతికే మాఫియా శక్తులను దరిదాపుల్లోకి రానివ్వద్దని పేదలకు, అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.

Tags: