ఎలిపి రత్న ప్రసాద్ కు సన్మానం
On
విశ్వంభర, బాగ్ లింగంపల్లి : “మహిళా సమాజం మేల్కొని సమాన హక్కులు సాధించాలి” అనే సందేశంతో కవిత్వం సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని తెలుగు అధ్యాపకుడు డాక్టర్ ఎలిపి రత్న ప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శంకర్ ఫౌండేషన్, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన “ఓ మహిళా మేలుకో” అనే కవితను వినిపించారు. మహిళల ఆత్మగౌరవం, సమానత్వం, సాధికారతను ప్రతిబింబించేలా కవిత సాగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహిళా లెజెండరీ జాతీయ పురస్కారాల ప్రధానోత్సవంలో ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఎలవర్తి ధనలక్ష్మి, బిక్కి కృష్ణ, కుసుమ తదితరులు పాల్గొన్నారు.



