దళితులకు కాంగ్రెస్ పెద్దపీట
- ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్
విశ్వంభర, సిద్దిపేట : కాంగ్రెస్ పార్టీ దళితులకు పెద్దపీట వేసి వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని ఆ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 12రోజున కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఛైర్మన్ గా ఖమ్మంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లోని గాంధీభవన్ జరుగుతుందని, సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా నుంచి అన్నివర్గాల ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పుట్ల యేసు, కొత్తూరి నరహరి, ముత్యాల యాదగిరి, బొడ్డు బాలరాజు, పుట్ల ప్రసాద్, మందాల దాసు, బూరుగుపల్లి సర్పంచ్ బాలయ్య, బయ్యారం యాదగిరి, కృష్ణ, యాదగిరి, కృష్ణ, శ్రీను, తిరుపతి, మల్లయ్య, శ్రీను, బాబు తదితరులు పాల్గొన్నారు.



