అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన
విశ్వంభర, రామన్నపేట: గ్రామాలలో, ఇళ్ళలో ఆకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాల పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని రామన్నపేట మండల స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి.మధుసూదన్ రెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూలులో బుధవారం రోజు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ చర్యల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాలు సంభవించడానికి గల కారణాలను క్షుణ్ణంగా వివరించారు. ఆకస్మాత్తుగా ప్రమాదాలు సంభవిస్తే పాటించవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్ డి.రామ నర్సయ్య, పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి.యాదగిరి, డైరెక్టర్ జెవియన్ఎస్ మణి, ఫైర్ సిబ్బంది మీర్జా షఫీ బేగ్, మహేశ్వరం పాండు, డి.గోపాల్, బి.ఇంద్రయ్య, ఆర్. సురేష్, పాఠశాల ఉపాద్యాయులు మురళి, రషీద్, మల్లేష్, శ్రీనివాస్, అలీమ్, మహాలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.



