మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. -వరంగల్ మేయర్ గుండు సుధారాణి. -ఘనంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ. - మహిళాశక్తిని చాటుతాం.. మహిళాభ్యున్నతికి కృషి చేస్తాం. - గుంటక రూప సదాశివ్ - మహిళా అధ్యక్షురాలు
On
- మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. -వరంగల్ మేయర్ గుండు సుధారాణి.
- -ఘనంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ.
- - మహిళాశక్తిని చాటుతాం.. మహిళాభ్యున్నతికి కృషి చేస్తాం. - గుంటక రూప సదాశివ్ - మహిళా అధ్యక్షురాలు
విశ్వంభర, హైదరాబాద్ :- మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. తెలంగాణ పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం ఏర్పాటు చేసిన నూతన క్యాలెండరు ఆవిష్కరణలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలీ విభాగం , తెలంగాణ ప్రాంత పద్మశాలి విభాగం నకు సంబందించిన జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి , తెలంగాణ అధ్యక్షులు కమర్తపు మురళి విశిష్ట అతిధులుగా పాల్గొని మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళా శక్తిని చాటుతూ ముందుకు వెళ్లడం గొప్ప పరిణామం అని అన్నారు. వంటింటికి పరిమితం కాకుండా ఆర్ధిక, రాజకీయ , సామాజిక రంగాల్లో దూసుకెళ్లాలని వారు అన్నారు. మహిళా విభాగానికి నూతన సంవత్సర, మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా గుంటక రూప సదాశివ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం ద్వారా క్యాలెండరు ఆవిష్కరణ చేసుకోవడం గొప్ప విషయమని అన్నారు. మహిళా శక్తిని చాటుతూ నిరంతరం మహిళల అభ్యున్నతికి కోసం కృషి చేస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మరింతగా మహిళా కోసం పలు కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. పాల్గొన్న ప్రముఖులందరికి నూతన సంవత్సరం , సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, మహిళా అధ్యక్షురాలు వనం దుష్యంతల, ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచందర్ రావు, వైస్ ప్రెసిడెంట్ గుర్రం శ్రవణ్, వీవర్సు వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ బర్రెంకల మధుసూదన్, ఏ సి పి చిలుకూరు వెంకటేశ్వర్లు, ఏసిపి రమేష్, ఇంజనీరింగ్ విభాగం జాతీయ అధ్యక్షుడు పుట్ట పాండురంగయ్య, చెన్నా నరేందర్ ,మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడ్డూర్ శశికళ, చిన్నకోట్ల స్వప్న రాజ్, కోశాధికారి నోముల రేఖ, వైస్ ప్రెసిడెంట్ బొమ్మల విజయ,పెగుడు అరుణశ్రీ, కైరంకొండ స్వరూప, ఎలగందుల శోభ, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షురాలు పోరండ్ల శారద గారు, రావిరాల సంధ్య,సికింద్రాబాద్ సేవా సమాజ్ అధ్యక్షురాలు గంజి రజిని, నోముల రజిని,దమ్మాయిగూడ మహిళా అధ్యక్షురాలు స్వాతి కిషోర్, కార్వాన్ అధ్యక్షురాలు లావణ్య, ఐటి పాముల మంజుల, కట్లమంగ, గారు తదితరులు పాల్గొన్నారు



