బతుకమ్మ కుంటలో చేపలు వదిలిన మెట్టు 

బతుకమ్మ కుంటలో చేపలు వదిలిన మెట్టు 

విశ్వంభర, అంబర్‌పేట : మాజీ మంత్రి హనుమంతరావు ప్రత్యేక చొరవతోనే అంబర్‌పేట బతుకమ్మ కుంట పునరుద్ధరణ సాధ్యమైందని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. అంబర్‌పేట బతుకమ్మ కుంటలో చేపల వదిలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెట్టు సాయి కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హనుమంతరావు హాజరై బతుకమ్మ కుంటలో చేపలను వదిలారు. ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి 100 శాతం సబ్సిడీతో రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటల్లో చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఇది వేలాది మత్స్యకారుల కుటుంబాలకు వరంగా మారిందన్నారు.  మాజీ మంత్రి హనుమంత రావు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా పోరాటం చేసి బతుకమ్మ కుంటను సాధించుకున్నామని చెప్పారు. కుంట పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరవ వ్యాప్తంగా చెరువులు, కుంటలు కబ్జాకు గురవకుండా కాపాడుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్, ఆర్. లక్ష్మణ్ యాదవ్, టీపీసీసీ కార్యదర్శులు శంభుల శ్రీకాంత్ గౌడ్, లక్పతి యాదగిరి గౌడ్, మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి, దిడ్డి రాంబాబు, సీనియర్ నాయకులు గరిగంటి రమేష్, సత్తిబాబు, నగేష్ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, కోటం అనిల్, రామ్మోహన్ రావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: