'హెల్పింగ్ హ్యాండ్స్' ఆర్థికసాయం

'హెల్పింగ్ హ్యాండ్స్' ఆర్థికసాయం

విశ్వంభర, సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన అజయ్ కుమార్ గౌడ్ కుటుంబానికి సిద్దిపేటకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ మిత్ర బృందం రూ. 6వేలు ఆర్ధికసాయం అందించింది. స్థానిక లోహిత్ సాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ కుమార్ గౌడ్ ను సంఘం ప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,  ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్స్ మిత్ర బృందం ప్రతినిధులు అనిల్, శ్రీకాంత్, శ్రావణ్, సంతోష్ రెడ్డి, నవీన్, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: