కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని నాలుగు కోర్టుల భవన సముదాయానికి శంకుస్థాపన కార్యక్రమం తెలంగాణ హైకోర్టు జస్టిస్ పి.శ్యామ్ కోసి కే.శరత్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో న్యాయాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఆ విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నామని అన్నారు. పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం జస్టిస్ కూనూరు లక్ష్మణ్ మాట్లాడుతూ, రామన్నపేటలో భవన సముదాయం త్వరగా నిర్మించి అందుబాటులోకి తీసుకు రావాలని అన్నారు. నిర్మాణంలో అనేక ఆటంకాలు ఉంటాయని, వాటన్నిటినీ అధిగమించి పూర్తిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి, జస్టిస్ సృజన కళాసికం, జస్టిస్ నర్సింగరావు నందికొండ, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, భువనగిరి జిల్లా కలెక్టర్ హన్మతరావు, జిల్లా ఎస్పీ అఖిలేష్ యాదవ్,సీనియర్ సివిల్ జడ్జ్ సబిత, జూనియర్ సివిల్ జడ్జ్ శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి మజీద్, సీనియర్ న్యాయవాదులు యాపాల కృష్ణారెడ్డి, అశోక్ కుమార్, కంపాటి యాదగిరి, ఉపాధ్యక్షులు యాదాసు యాదయ్య, ప్రధానకార్యదర్శి నకిరేకంటి మోగులయ్య, జినుకల ప్రభాకర్, హనుమంతు గౌడ్, ప్యానల్ లాయర్ మామిడి వెంకటరెడ్డి, ఏజిపి సుక్క శ్రవణ్ కుమార్, బి.అశోక్ కుమార్, జగతయ్య, డేవిడ్, బాలరాజు, శ్రీశైలం, స్వామి, రమేష్, అజీజ్, జితేందర్, తదితరులు పాల్గొన్నారు.



