పరీక్షల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి.

విద్యార్థులకు ప్రముఖ వ్యాపారవేత్త మహేందర్ గౌడ్ శుభాకాంక్షలు

పరీక్షల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి.

విశ్వంభర, షాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రముఖ వ్యాపారవేత్త మహేందర్ గౌడ్ ఆకాంక్షించారు. రాబోయే పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పరీక్షలను ఒత్తిడిగా కాకుండా తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశంగా భావించాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశయాలను నిలబెట్టే విధంగా మంచి ఫలితాలు సాధించాలని కోరారు.భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్యే బలమైన ఆయుధమని పేర్కొంటూ, లక్ష్యసాధనకు పట్టుదల మరియు కృషి అవసరమని మహేందర్ గౌడ్ విద్యార్థులకు సూచించారు.  ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఆయన ఆకాంక్షించారు

Tags: