భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
విశ్వంభర,జంగమెట్ :-భాగ్యనగర్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు గోపి నాయక్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ 47 ఆవిర్భావ దినోత్సవం చంద్రాయన గుట్ట నియోజకవర్గంలోని జంగమెట్ లో అంగరంగ వైభవం గా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ డివిజన్ మాజీ అధ్యక్షుడు M జగదీష్ పాల్గొన్నారు. ఎం జగదీష్ మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా సంఘ్ స్థాపకుడు మరియు ప్రముఖ హిందూ జాతీయ వాద నాయకుడు, ఆయన కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని బలంగా వాదించి, దీనికోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేశారు అని చెప్పుకొచ్చారు . శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం బూత్ ప్రెసిడెంట్ రాకేష్ భారతీయ జనతా పార్టీ జెండాని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో గోపి నాయక్, ప్రవీణ్ రాథోడ్, రఘు, మహేందర్ మరియు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు



