రైతులకు అండగా ఉంటా: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
విశ్వంభర, పరిగి: రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కాలాపూర్, రాపోల్ గ్రామాలలో రైతుల 1197 ఎకరాల భూమిని సేకరించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు గ్రామాల రైతులు ఆందోళ కు గురై నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి కాలాపూర్, రాపోల్ గ్రామాల రైతులను కలిసి వారికి నేనున్నానని భరోసా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలో లేదని అన్నారు. 20 సంవత్సరాల క్రితం గండీడ్ మండలంలో భూసేకరణ చేసి ఇప్పటికీ ఒక్క ఇండస్ట్రీ కూడా రాలేదని, ఇండస్ట్రియల్ పేరిట రాకంచెర్ల లో సేకరించిన భూముల్లో ఇంతవరకు ఇలాంటి పరిశ్రమలు రాలేదని అన్నారు. నేను ప్రజా ప్రతినిధిని మీరు ఓట్లు వేస్తే నేను గెలిచాను, న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తానని రైతులందరికీ హామీ ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప, పరిగి బిజెపి ఇంచార్జ్ మారుతి కిరణ్, జిల్లా బిజెపి కన్వీనర్ ప్రహ్లాద రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరమేశ్వర్ రెడ్డి, దిశా కమిటీ సభ్యులు వెంకటయ్య, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పెంటయ్య గుప్తా, నాగేశ్వర్, హరికృష్ణ, జానకిరామ్, నరసింహ, బాలకృష్ణారెడ్డి, ఘనపూర్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.



