ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయాలి
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
విశ్వంభర, సూర్యాపేట: మంగళవారం హైదరాబాద్ నుండి చీఫ్ సెక్రటరీ రామ కృష్ణా రావు, వైద్య, పంచాయతి రాజ్, మున్సిపల్, మైనింగ్ కార్యదర్శులతో ఏప్రిల్ 2వ తేదీన ప్రజాపాలన .. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు తెలియచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీకి వచ్చిన నిధులు వివరించి గ్రామాభివృద్ధికి ఉపయోగించుకునే వివరాలను తెలియచేయాలన్నారు. ప్రజాపాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తెలిపారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని, క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియచేయాలని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లాలని. అలాగే ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలతో పాటు పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఇంటర్ విద్యార్థుల కు మధ్యాహ్న భోజనం గురించి గ్రామసభల్లో వివరించాలని తెలిపారు. గ్రామసభలకు విధి విధానాలు జారీ చేశామని ఆ ప్రకారం గ్రామ, వార్డు సభలకు ప్రజా ప్రతినిధుల ను ఆహ్వానించాలని తెలిపారు. గ్రామ సభ ప్రారంభానికి ముందు రాష్ట్ర గీతం అలపించాలని, తదుపరి సీఎం సందేశం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు వినిపించాలని తెలి పారు. రైతు భరోసా, ఉచిత విద్యుత్తు, వ్యవసాయ బోర్లు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, సన్న బియ్యం తదితర పథకాలపై లబ్దిదారులతో మాట్లాడించాలని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉప ముఖ్యమంత్రి కు వివరిస్తూ గ్రామ సభల ద్వారా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి చేరే విధంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. గ్రామ, మున్సిపల్ వార్డు సభల స్పెషన్ ఆఫీసర్లు, ఇతర సీనియర్ అధికారులు గ్రామ పంచాయితీ లలో క్షేత్ర స్థాయీలో పర్యటనలు చేస్తూ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పదకాలను ప్రజల్లోకి చేరే విధంగా ప్రత్యేక ప్రాణాళికతో ముందుకు పోతున్నట్లు వివరించారు. శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకొని కొత్తగా ప్రవేశపెడుతున్నపధకలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన లబ్దిదారుల జాబితాను గ్రామ పంచాయితీలకు పంపించడం జరిగిందని ప్రజా ప్రతినిదుల సహకరంతో ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ శిరీష, ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, జిజిహెచ్ సూపర్డెంట్ శ్రవణ్ కుమార్ ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



