ఘనంగా బొడ్రాయి వార్షికోత్సవం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామంలోని శ్రీపార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానంలో బొడ్రాయి పదవ వార్షికోత్సవం సందర్భంగా గణపతి పూజ, నవగ్రహ పూజ, మహాన్యాస రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఉప-సర్పంచ్ మూడుదుడ్ల అనూష రమేష్, శ్రీపార్వతీ పరమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రాపోలు రమేష్, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ అప్పం రామేశ్వరం, మాజీ ఎంపిటిసి బడుగు రమేష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు జెల్లా శ్రీనివాస్, పార్వతీ పరమేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు బలుగూరి లింగస్వామి, కొంగరి జంగయ్య, సింగం నరసింహ, సంగిశెట్టి గణేష్, దంతూరి యాదగిరి, మామిడి చందన, వార్డు సభ్యులు పున్న వెంకటేశం, గాదె యాదయ్య, సంగిశెట్టి మహేష్, గుంటొజు కృష్ణమాచారి, కంకల అర్చన, పగుడాల లక్ష్మి, గాదె శంకరయ్య, జెల్లా సూర్యకళ, నాయకులు అప్పం గోయల్, పున్న అమరేందర్, జెల్ల.శ్రీనాథం, కొంగరి బాలరాజు, ఏలె నరసింహ, జెల్ల లక్ష్మీనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు అప్పం రాములు, పృథ్వీరాజు, గోపాలచార్యులు తదితరులు పాల్గొన్నారు.



