విద్యార్థులకు అభినందన

విద్యార్థులకు అభినందన

  విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విపంచి ఫౌండేషన్ వారి సహకారంతో గురుకుల పాఠశాలలో సీటు పొందిన విద్యార్థులకు అభినందన సమావేశము ఏర్పాటు చేసారు.. ఈ సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్  ఇడెం రాధ శ్రీనివాస్, విపంచి చైర్మన్ ఎనుమల శ్రీనివాస్, గౌరవ సలహాదారు నాగభూషణం, ఏఏపిసి చైర్ పర్సన్ పులగం సులోచన, గ్రామ ఉప-సర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు. అదేవిధంగా విపంచి ఫౌండేషన్ వారు అందించిన చేయూతను అభినందించడం జరిగింది. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించి, విద్యార్థుల భావి భవిష్యత్తుకు సహాయ సహకారాలు అందించిన విపంచి ఫౌండేషన్ బాధ్యులు అనుమల శ్రీనివాస్, గౌరవ సలహాదారు నాగభూషణ్, విపంచి ఫౌండేషన్ గ్రామ బాధ్యులు నకిరేకంటి సతీష్ లను  పాఠశాల అభివృద్ధి దాతలు ఇడెం శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ ఇడెం రాధ శ్రీనివాస్ సత్కరించడం జరిగింది. అదేవిధంగా గ్రామ పెద్దలు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఇట్టె సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కోసనం మాధవి, నకిరేకంటి అశ్విని, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Tags: