టూవీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నిక
విశ్వంభర, చిక్కడపల్లి : ముషీరాబాద్ టూవీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుబంధ సంస్థ గాంధీనగర్ టూవీలర్ మెకానిక్ అసోసియేషన్ కు మంగళవారం జరిగిన ఎన్నికల్లో బల్ల ప్రశాంత్ విజయం సాధించారు.గాంధీనగర్ టువీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో సీతా బాలకృష్ణ, బల్ల ప్రశాంత్, రామచంద్ర రెడ్డి లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ గౌడ్ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన బల్ల ప్రశాంత్ విజయం సాధించారు. ఆయనకు జగన్ గౌడ్ నియామక పత్రం అందజేసి, అభినందించారు. ఎన్నికలలో విజయం సాధించిన బల్ల ప్రశాంత్ మూడు సంవత్సరాలు పదవి కాలంలో కొనసాగుతారని తెలిపారు. అనంతరం బల్ల ప్రశాంత్ మాట్లాడుతూ, తన పై నమ్మకం ఉంచి అత్యధిక ఓట్లు వేసి గెలిపించిన గాంధీనగర్ టు వీలర్ మెకానిక్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మెకానికులకు అన్ని విధాల అండగా ఉంటానని అన్నారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.



