పరిగి అభివృద్ధే లక్ష్యం

పరిగి అభివృద్ధే లక్ష్యం

  • ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

:విశ్వంభర, పరిగి:  పరిగి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టణంలో మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజ్, తాగునీటి వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.ప్రతి వార్డుకు సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలాఅధికారులు,ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల రజిత వెంకటేష్,మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య,వైస్ చైర్మన్ హనుమంతు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Tags: