విద్యుత్ తీగల సమస్యకు పరిష్కారం

విద్యుత్ తీగల సమస్యకు పరిష్కారం

విశ్వంభర, పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని ఖాన్ కాలనీలో ప్రమాదకరంగా వేలాడుతూ నేలను తాకుతున్న విద్యుత్ తీగల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఈ సమస్యపై కౌన్సిలర్ సమీనా బేగం మీర్ తాహేర్ అలీ గత సంవత్సరం నవంబర్ నెలలో విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, శాఖ అధికారులు స్పందించి అవసరమైన చర్యలు చేపట్టారు. 13 వ వార్డు ఖాన్ కాలనీలో విద్యుత్ స్తంభాలకు అనుసంధానమైన కొన్ని తీగలు చెట్ల మధ్యగా వెళ్లి, కొన్ని చోట్ల నేలను తాకుతూ ఉండటంతో వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్ ఘటనలు చోటుచేసుకున్నాయి. కాలనీలో చిన్నారులు ఎక్కువగా సంచరిస్తుండటంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం నవంబర్ నెలలో తన పదవి కాలం పూర్తయిన ప్రజల సమస్యల పట్ల రాజీపడని కౌన్సిలర్ సమీనా మీర్ తాహేర్ అలీ విద్యుత్ శాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పుడు స్పందించని అధికారుల దృష్టికి మార్చ్ 29న  తీసుకువెళ్లడం తో స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు ఫిర్యాదును పరిశీలించి  సంభందిత స్థలాన్ని సందర్శించి, ప్రమాదకరంగా ఉన్న తీగలను స్తంభాలకు బిగించి నూతనంగా విద్యుత్ స్థంభం ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ స్పందించి చర్యలు తీసుకున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ మౌనిక, కాలని వాసులు అంజద్, అహ్మద్, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Tags: