పశువులకు టీకాలు వేయించాలి
On
విశ్వంభర, గుండాల : గుండాల మండలంలో బండ కొత్తపల్లి గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాలు కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 95 పశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ నరేందర్, మండలం పశు వైద్యాధికారి డాక్టర్ యాకుబ్, వి ఏ రాజు, గోపాలమిత్రలు గోవింద్ కృష్ణ, నరేష్, శ్రీను, శేఖర్ ,సోమశేఖర్, రైతులు పాల్గొన్నారు.



