స్వయం ఉపాధి దరఖాస్తుల గడువు పొడిగింపు
విశ్వంభర, సిద్దిపేట: జిల్లా షెడ్యూల్డ్ కులాల స్వయం ఉపాధి పథకం దరఖాస్తుల గడువు పొడిగించినట్టు కలెక్టర్ హైమావతి మంగళవారంనాడొక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునే గడువును ఏప్రిల్ 8తేదీ వరకు పొడిగించినట్టు తెలిపారు. అర్హతగల లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్, సోలార్ యూనివర్సల్ పంప్ సెట్, ఉపాధి, స్వయం ఉపాధి ఆధారిత శిక్షణా కార్యక్రమాల పథకాలతో పాటు, అదనంగా "2పాడి పశువుల పథకాన్ని పోర్టల్‌లో చేర్చినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత దరఖాస్తు ఫారంతో పాటు సంబంధిత ధృవపత్రాలను జత చేసి ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఆర్థికంగా స్థిరపడటానికి, స్వయం ఉపాధిని పెంపొందించుకోవడానికి ప్రభుత్వం అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.



