రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
On
విశ్వంభర, చంద్రాయన గుట్ట : చంద్రాయణ గుట్ట నియోజకవర్గం లోని టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్బంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉద్యమ నేత కెసిఆర్ కు కక్షపూరితంగా సిట్ నోటీ సులు ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ బెదిరింపులకు లొంగేది లేదని వచ్చే కార్పొరేషన్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తారని అన్నారు. వచ్చే ప్రభుత్వం మళ్ళీ మాదేనని కాంగ్రెస్ ప్రభుత్వానికి బెదిరేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రాయన్ గుట్ట మహిళా నాయకురాలు సరిత, టిఆర్ఎస్ నాయకులు సింగం శ్రీనివాస్, బ్రహ్మచారి, దర్శన్, యువ నాయకులు భాను, మల్లేష్ యాదవ్, శంకర్ ముదిరాజ్, నాయి నరసింహ బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.



