.వి.కె ఆధ్వర్యంలో కిసాన్ మేళా
విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం మండలం కంపసాగర్లోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ మేళా , వ్యవసాయ ప్రదర్శన విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంప సాగర్ ఏ.ఆర్.ఎస్ ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఎన్. లింగయ్య (ఏ డి ఆర్ ప్రతినిధి) అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు వ్యవసాయంలో పలు పంటలపై సాగులో తీసుకోవాల్సిన సస్య చర్యలను అవలంబించాల్సిన పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమం ప్రధానంగా (హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టం.) దూరం సాగు( క్లోజర్ ఫేసింగ్ ) విధానాలపై రైతులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా సాగింది. ఈ కార్యక్రమంలో కొండ రమాదేవి భాస్కర్: సర్పంచ్, కంపసాగర్,కె. అరుణ:సర్పంచ్,బాబుసాయిపేట,డాక్టర్ వి. శ్రీధర్: సీనియర్ శాస్త్రవేత్త, (ఏ ఆర్ ఎస్ )కంపసాగర్, నరేష్: ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కెవికె గడ్డిపల్లి, రిషిత: ఉద్యానవన అధికారి, నిడమనూరు, శశికళ: పశువైద్యురాలు, పి. ప్రసాద్ ( ఏజీఎం అగ్రోనమీ) డి.వి. ఎల్.ఎన్. రాజు (సీనియర్ మేనేజర్), కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కెవికె శాస్త్రవేత్తలు: డాక్టర్ కె. చంద్రశేఖర్ (సీనియర్ శాస్త్రవేత్త & హెడ్), ఎ. రాములమ్మ (ప్లాంట్ ప్రొటెక్షన్), టి. హిమబిందు (హార్టికల్చర్) పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. డాక్టర్ కె. చంద్రశేఖర్ 2023 నుండి 2025 వరకు కంప సాగర్ కె వి కె లో జరిగిన హెచ్ డి పి ఎస్ పత్తి సాగు విజయాలను వివరించారు. భూసారాన్ని పెంచడానికి పత్తి తర్వాత పప్పుధాన్యాలు లేదా నూనెగింజల పంట మార్పిడి అవసరమని నొక్కి చెప్పారు. మితిమీరిన యూరియా వాడకం వల్ల భూమిలోని సూక్ష్మజీవులు నశిస్తాయని, భూగర్భ జలాలు కలుషితమవుతాయని హెచ్చరించారు. డాక్టర్ ఎన్. లింగయ్య అమెరికాలో అమలవుతున్న అధునాతన హెచ్ డి పి ఎస్ సాంకేతికత గురించి మరియు మన ప్రాంతంలో దాని అమలు తీరును వివరించారు. ఎ. రాములమ్మ మాట్లాడుతూ,..హెచ్ డి పి ఎస్ పత్తి తక్కువ కాలపరిమితి కలిగి ఉండటం వల్ల గులాబీ రంగు పురుగు ఉధృతి నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. పత్తిలో వచ్చే తెగుళ్ల గుర్తింపు, నివారణపై అవగాహన కల్పించారు. టి. హిమబిందు హెచ్ డి పి ఎస్ సాగుకు అనువైన రాశి స్విఫ్ట్, రాశి మాక్స్, అమృత, సిరి, మరియు నవనీత్ వంటి రకాలను సూచించారు. ఇవి ఎర్ర ఇసుక నేలల్లో కూడా అధిక దిగుబడిని ఇస్తాయని తెలిపారు. కోరమాండల్ ప్రతినిధి పి. ప్రసాద్ మాట్లాడుతూ.. హెర్బిసైడ్ టాలరెంట్ ( హెచ్ టి) పత్తిని నివారించాలని, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. ఉద్యాన అధికారి రిషిత నానో- యూరియా మరియు నానో-డిఎపి ( నానో- డి ఏ పి ) వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే మేళాతో పాటు ఏర్పాటు చేసిన భారీ ప్రదర్శనలో పలు ప్రముఖ కంపెనీలు తమ విత్తనాలు, ఎరువులు,అత్యాధునిక పరికరాలు డ్రోన్లు, యంత్రాలు ప్రదర్శించడం జరిగింది. సుమారు 420 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు



