కల దేవతలు గోమాతలోనే
విశ్వంభర, సూర్యాపేట: హిందూ ధర్మంలో సకల దేవతలు గోమాతలోనే కొలువై ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయిబాబా దేవాలయంలో గల గోశాలలో ఆధ్యాత్మిక సేవకులు, శ్రీ వాసవి సేవాసమితి సభ్యులు ఓరుగంటి సోమన్న 89 వ జన్మదిన సందర్భంగా గోపూజ నిర్వహించి, గోవులకు గో గ్రాసం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఓరుగంటి సోమన్న సూర్యాపేట పట్టణంలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు తన వంతుగా సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఓరుగంటి సోమన్న కు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అన్నారు. అనంతరం దేవాలయం ఆవరణలో ఫ్రూట్ కటింగ్ నిర్వహించారు. ఓరుగంటి సోమన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఆధ్యాత్మిక సేవకులు ఓరుగంటి సోమన్న సేవలను కొనియాడారు. అంతకుముందు లయ న్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాణిజ్య భవన్ సెంటర్ వద్ద పేద ప్రజలకు అల్పాహారం పంపిణీ చేశారు. శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోష్టి భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవాసమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్ ఉపాధ్యక్షులు పోతుగంటి వెంకటేశ్వర్లు, రాచకొండ శ్రీనివాస్, బెలిదే శ్రీనివాస్, బిక్కు మల్ల కృష్ణ, సోమా ధనుంజయ్, శ్రీరంగం రాము, వెంపటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



