నల్లా పన్ను నిర్ణయం ఉపసంహరించుకోవాలి

నల్లా పన్ను నిర్ణయం ఉపసంహరించుకోవాలి

విశ్వంభర, ఇనుగుర్తి: మేజర్ గ్రామపంచాయతీ ఇనుగుర్తి  ఏప్రిల్ 1నుంచి నల్లా పన్నులను పెంచాలనే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో బండారి పార్థసారధికి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు దుంపల సందీప్ మాట్లాడుతూ, నల్లాకు రూ.50 చొప్పున వసూలు చేయడం ప్రజలపై ఆర్థిక భారం మోపడమే అవుతుందన్నారు. గతంలో జీరో వాటర్ టాక్స్ అమల్లో ఉండేదని ఇప్పుడు పన్ను లు వేయడం సరైనది కాదని, మండల పరిధిలోని అన్ని గ్రామాలలో పన్నులు లేకుండా జీరో వాటర్ టాక్స్ అమలు చేయాలని ఎంపీడీవోను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు,గాయపు సురేందర్ రెడ్డి, వల్లంల రాజేందర్,గోనె శ్రీను,భోగ అనిల్,సపావత్ సురేష్ పాల్గొన్నారు.

Tags: