వెల్లంకిలో కోతుల నివారణకు చర్యలు
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామంలో కోతుల వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయంలో స్పందించిన గ్రామ సర్పంచ్ ఇడెం రాధా శ్రీనివాస్ తన సొంత నిధులతో కోతులను బంధించే బోనులు తయారు చేయించడం జరిగింది. అలాగే మంగళవారం రోజు గ్రామంలో కోతులను బంధించడం కోసం మనుషులను పిలిపించి సుమారు 100 కోతులను పట్టించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం కోసం నూతన బోనులు తయారు చేయించడం జరిగిందని, గ్రామస్తుల సహకారంతో కోతులను పట్టించి శ్రీశైలం అడవులలో విడిచిపెట్టడం జరుగుతుందని తెలియజేశారు. గ్రామ ప్రజలందరూ కోతులను బంధించే విషయంలో సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్, పంచాయతీ సెక్రటరీ మోహన్, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.



