గేదె పొట్టలో బట్ట పీలికలు.. సంచులు.. ప్లాస్టిక్ కవర్లు.. 

గేదె పొట్టలో బట్ట పీలికలు.. సంచులు.. ప్లాస్టిక్ కవర్లు.. 

  • -శస్త్రచికిత్స తో తొలగించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి పెంటయ్య

విశ్వంభర,  కోదాడ: దినదినం జంతువుల పాలిట ప్రమాదకరంగా మారుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు  ఈ మధ్యకాలంలో ఆవులు , గొర్రెలు, కోళ్లు, కుక్కలు,మేకల పొట్టల్లో తొలగించిన విషయం  మరువనే లేదు. ఇప్పుడు ఒక పాడి గేదె పొట్టలో ప్లాస్టిక్ కవర్లతో పాటు పెద్ద ఎత్తున బట్టలు, గుడ్డ సంచులు  దారాలు కూడా బైట పడడం చూస్తుంటే మానవ ఉపయోగిత వ్యర్థాలు జంతువుల పాలిట ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో అర్థం అవుతుంది.చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామానికి చెందిన రైతుపాడి గేదె వారం రోజులుగా మేత మేయకుండా పాలు ఆపి వేసింది. అందుబాటులో ఉన్న వైద్యం అందిస్తున్నా రోజు రోజుకి పొట్ట ఉబ్బుతూ పేడ వేయడం ఆపేసింది. పొట్ట బాగా ఉబ్బిపోవడం తో ఆయాసం వచ్చి పడుకోలేక గడ్డి తినక కడుపునొప్పితో విలవిలలాడుతుంటే  మెరుగైన వైద్యం కోసం ఈరోజు కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకు వచ్చారు.గేదెను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్  డా పి పెంటయ్య, ఎనిమిదవ నెల సూ డి తో ఉన్న గేదె పొట్ట నిండా గ్యాస్ పేరుకుపోయినట్టు గుర్తించారు. పొట్ట ఉబ్బి దూడకు కూడా శ్వాసకు ఇబ్బందిగా మారడంతో పొట్ట కి శస్త్ర చికిత్స నిర్వహించారు. పొట్ట తెరవడంతోనే ఒక్కసారిగా గ్యాస్ తో కసరు నలువైపులా ఎగసిపడింది. అనంతరం అరల పొట్టలో ఒక అర నుండి మరో అరకు కసరు వెళ్లకుండా అడ్డు పడిన వాటిని తీసి పరిశీలించగా పెద్ద మొత్తం లో బట్ట పీలికలు, గుడ్డ సంచులు, తాళ్లు, సుతీల్ దారాలు ప్లాస్టిక్ కవర్లు వడితిరిగి రాయిలాగా బిగదీసుకుపోయాయి. అతి కష్టం మీద అవన్నీ తొలగించి తిరిగి లోపల పొట్టని కండరాలను చర్మాన్ని కుట్లతో మూసి విజయవంతంగా శస్త్ర చికిత్స ముగించారు . చికిత్స అనంతరం ఆరోగ్యంగా తిరుగుతున్న గేదెని ఫాలో అప్ చికిత్సకోసం దగ్గరలోని బంధువుల ఇంటికి తరలించారు.అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ నక్కగూడెం  కృష్ణా నది ఒడ్డున ఉన్నందున  జనాలు వాడి పడేసిన బట్టలు సంచులు, ప్లాస్టిక్ తదితరాలు నీటి ప్రవాహానికి ఒడ్డుకు వస్తాయని గేదె అక్కడ మేయడానికి వెళ్లినప్పుడు  అందులో ఉన్న వ్యర్థాలతో తినేసి ఉంటుందని కాలక్రమం లో  అవన్నీ పేరుకుపోయి ఇప్పుడిలా ప్రమాదం ఏర్పడి ఉంటుందని,  ప్రజలు వాడి పడేసే వస్తువులు అజాగ్రత్తగా పడేయరాదని,అలాగే జంతు యజమానులు తమ పశువులను వ్యర్థాలు పడేసిన ప్రాంతాల్లో మేపరాదని సూచించారు.శస్త్ర చికిత్సలో సిబ్బంది రాజు, రామకృష్ణ, సాగర్ , రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Tags: