ఘనంగా ఏఎస్ఐ పదవీ విరమణ వేడుక
- యాకయ్యకు పోలీస్ అధికారుల అభినందన
విశ్వంభర,నెల్లికుదురు: విధుల పట్ల అంకిత భావం, సమయపాలన,సేవాగుణంతో సుదీర్ఘ పోలీస్ వృత్తిని విజయవంతంగా పూర్తి చేసిన ఏఎస్ఐ గుంటుక యాకయ్య సేవలు అపూర్వమని సీఐ సత్యనారాయణ,ఎస్సై చిర్ర రమేష్ బాబు ఇనుగుర్తి,కేసముద్రం ఎస్ఐలు క్రాంతి కిరణ్, కరుణాకర్ అభినందించారు.మండల కేంద్రం నెల్లికుదురు లోని మినీ ఫంక్షన్ హాల్లో ఏఎస్ఐ యాకయ్య పదవీ విరమణ వేడుక స్థానిక ఎస్సై రమేష్ బాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ యాకయ్య పద్మ దంపతులను పోలీసు ఉద్యోగులతో పాటు, బంధువులు శ్రేయోభిలాషులు మిత్రులు మెమెంటోలు,బహుమతులు అందజేసి పూలమాలలు,శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో డ్యూటీని ఎంతో బాధ్యతగా నిర్వర్తించిన గొప్ప వ్యక్తి యాకయ్య అని,ఆయన విశ్రాంత జీవితం ఆరోగ్యంగా,ఐశ్వర్యాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. వీడ్కోలు సన్మాన గ్రహీత యాకయ్య మాట్లాడుతూ తన ఉద్యోగ జీవితంలో సహకరించిన పోలీసు ఉద్యోగులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.అంతకు మునుపు జిల్లా కేంద్రం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ శబరీష్,డిఎస్పి తిరుమలరావు,ఎస్సై రమేష్ బాబు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటరెడ్డి పోలీసులు శ్రీను,రాము,కిరణ్, రాంబాబు,ఉమాకర్,యాకన్న,రమ, లింగన్న, రవీందర్,సత్యనారాయణ,రఘు,భరత్,రాకేష్, వికాస్,వీరస్వామి,శంకర్ తదితరులు పాల్గొన్నారు.



