బాధిత కుటుంబాలకు హరీశ్‌రావు పరామర్శ
విశ్వంభర, సిద్దిపేట: అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మంగళవారం పరామర్శించారు. అనారోగ్యంతో సిద్దిపేట సురక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నంగునూర్ మండలం సిద్ధన్నపేట గ్రామ సర్పంచ్ సంగు పురేందర్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త డాకూరి రాజశేఖర్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయన్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా రైతు బంధు మాజీ సభ్యుడు మెడికాయల వెంకటేశం ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఆయనను పరామర్శించి, ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. చిన్నకోడూరు గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన శ్రీనివాస్ కొడుకు ఇటీవల మృతిచెందగా చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ కార్యకర్తలు నర్సయ్య, కాయల కమలాకర్ రెడ్డి ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబాలను, అదే గ్రామానికి చెందిన సిద్దిపేట రూరల్ ఇన్‌ఛార్జి ఎంపీడీఓ రామరాజు తమ్మడు అనిల్ బ్రెయిన్ స్ట్రోక్‌తో చనిపోగా వారిని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.



