తపస్య డిగ్రీ కాలేజీలో మెగా రక్త దాన శిబిరం
విశ్వంభర, దిల్ షుఖ్ నగర్: తల సేమియా బాధితుల కోసం మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో తపస్య డిగ్రీ కాలేజీ దిల్సుఖ్నగర్ బ్రాంచ్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథి బ్రాంచ్ హెడ్ శ్రీధర్ రాజు ప్రారంభించారు. రక్తదానం చేసిన 34 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. రక్తదానం నిర్వహించిన చేపూరి శంకర్ ని ప్రిన్సిపల్ జె త్రివేణి అభినందించారు. ఈ సందర్బంగా చేపూరి శంకర్ మాట్లాడుతూ, భారతదేశంలో రక్త మందక రోజుకు 12,000 మంది మరణిస్తున్నారు కొన్ని ప్రాంతాలలో 40% మంది నివాసితులకు బ్లడ్ బ్యాంకుల సేవలు సకాలంలో అందుబాటులో లేవు భారతదేశంలో ప్రతి 2 సెకండ్లకు ఒకరికి రక్తం అవసరం అవుతుంది అత్యవసర కేసులు తల సేమియా లేదా సికిల్ సెల్ అనిమియా వంటి వ్యాధులతో బాధపడుతున్నా తరచుగా రక్తం మార్పిడి అవసరమయ్యే రోగులు ఎక్కువగా ప్రభవితమవుతున్నారన్నారు. భారతదేశంలోని యువతలో (18-నుండి 25) ఏళ్ల వయస్సు 85.5%మంది ఇప్పటివరకు రక్తదానం చేయలేదు , యువత పక్కదారి పట్టకుండా సరైన సామాజిక సేవ మార్గంలో ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్య డిగ్రీ కాలేజ్ స్టాఫ్ నెంబర్స్, రెడ్ క్రాస్ వైద్య సిబ్బంది డాక్టర్ రామ సుబ్బారెడ్డి, చేపూరి సందీప్, ప్రభాకర్, జయమ్మ, విజయ్, పల్లవి, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.



