బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొవ్వూరి
On
విశ్వంభర, సదాశివపేట్: తెలంగాణ రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులుగా కోవూరు సంగమేశ్వర్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్రావు నియమించారు. ఈ సందర్భంగా కొవ్వూరు సంగమేశ్వర మాట్లాడుతూ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రెండవసారి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో బిజెపి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర బిజెపి పార్టీ పెద్దలు ఎంపీ రఘునందన్ రావు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి , పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.



