అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక భవాని ఆసుపత్రిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాల పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని స్టేషన్ ఫైర్ ఆఫీసర్ బి.మధుసూదన్ రెడ్డి కోరారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో, అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలో, అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవిస్తే పాటించవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ ఫైటర్ డి.రామనర్సయ్య, ఫైర్ సిబ్బంది మీర్జా షఫీ భేగ్, మహేశ్వరం పాండు, డి.గోపాల్, భవాని హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



