బజార్ వేలం పాట 

బజార్ వేలం పాట 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో   గ్రామ పంచాయతీలో ప్రతి శుక్రవారం నిర్వహించే తైబజార్, మేకల సంత వేలం పాటలో మహేశ్వరం గ్రామానికి చెందిన మిద్దింటి సిద్దు రూ.7,80,000 లకు కైవసం చేసున్నారు. కూరగాయల మార్కెట్ ను ఏపూరి ప్రభాకర్  రూ.  2 లక్షలకు  సొంతం చేసున్నారు. ఈ కార్యక్రమములో ఉప సర్పంచ్ జొరల రమేశ్ , వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి,  పంచాయతీ కార్యదర్శి  సుజాత గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags: