కానిస్టేబుల్‌ మానవతా దృక్పథం

కానిస్టేబుల్‌ మానవతా దృక్పథం

విశ్వంభర, సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఓ పేషంట్‌కు అత్యవసర చికిత్స నిమిత్తం 'ఓ పాజిటివ్' రక్తం అవసరం ఏర్పడింది. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ చంద్రశేఖర్ మానవతా దృక్పథంతో స్పందించారు. వెంటనే ప్రభుత్వ రక్తనిధి కేంద్రానికి చేరుకుని రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో ఆదుకున్న చంద్రశేఖర్‌ను సీఐ వాసు అభినందించారు. బాధిత కుటుంబసభ్యులు కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు

Tags: